జాతీయ లోక్ అదాలత్ లో 32 కేసులు రాజీ

పట్టణంలోని స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో శనివారంనాడు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా న్యాయ విజ్ఞన సదస్సు కార్యక్రమంలో 32కేసులను పరిష్కరించారు.

ఈ సందర్భంగా పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి రాఘవేంద్ర మాట్లాడుతూ వివిధ కేసులు మనిషిలోని ప్రవర్తన వల్ల జరుగుతూ ఉంటాయి….. మనిషి ప్రవర్తన అదుపులో పెట్టుకుంటే కేసులు కొంత వరకు తగ్గించవచ్చునని అన్నారు.

అలాగే లోక్ అదాలత్ సేవను వినియోగించుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ కేసులకు పరిష్కారానికి ఆస్కారం ఉంటుందని….. కేసులలోని కక్షిదారులు రాజీకి వచ్చినంత మాత్రన ఓడిపోయినట్లు కాదని….. అలాగే వారి యొక్క సమస్యలు త్వరగా పరిష్కరం అవడంతో పాటు సమయం, డబ్బు ఆదా అవుతాయని అన్నారు.

అనంతరం జరిగిన సదస్సులో మొత్తం 32కేసులు రాజీ కావడం జరిగిందని కోర్టు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి , కొనకనమిట్ల మండలాల యస్ఐలు సురేష్, వెంకటేశ్వర నాయక్, న్యాయవాదులు దర్నాసి రామారావు, మునగాల రమణ కిషోర్, వరికూటి నాగరాజు, న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు