కరోనా వైరస్ హోమియో మందు పంపిణీ చేసిన జడ్జి రాఘవేంద్ర

కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు ముందుస్తు జాగ్రత్తగా హోమియో మందును పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర చేతుల మీదుగా పంపిణీ చేశారు.

వివరాల్లోకి వెళితే శనివారంనాడు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో కరోనా వైరస్ రాకుండా ముందుస్తు చికిత్సలో భాగంగా మందులను పంపిణీ కార్యక్రమాన్ని జడ్జి రాఘవేంద్ర లాంఛనంగా ప్రారంభించిన….. అనంతరం మాట్లాడుతూ వ్యాధి రాకముందే నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమమని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి సుధారాణి ,పొదిలి , కొనకనమిట్ల మండలాల యస్ఐలు సురేష్, వెంకటేశ్వర నాయక్, న్యాయవాదులు దర్నాసి రామారావు, మునగాల రమణ కిషోర్, వరికూటి నాగరాజు, న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.