రమేష్ బాబు విగ్రహావిష్కరణ

గీతాంజలి విద్యా సంస్థల అధినేత స్వర్గీయ కశిరెడ్డి వెంకట రమేష్ బాబు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే శనివారంనాడు గీతాంజలి విద్యాసంస్థల వారి నూతన గృహప్రవేశం సందర్భంగా వారి గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, మాజీ శాసనసభ్యులు జంకె వెంకట రెడ్డి, గీతాంజలి విద్యా సంస్థ అధినేత్రి కశిరెడ్డి భాగ్యలక్ష్మి, వైసిపి నాయకులు సాయిరాజేశ్వరావు, వాకా వెంకటరెడ్డి, నరసింహారావు, సంజీవరెడ్డి, విద్యా సంస్థల అధినేతలు, వివిధ రాజకీయ పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.