చైతన్య కళాస్రవంతి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఘంటసాల పాటల పోటీలు
ఘంటసాల రాష్ట్రస్థాయి పాటల పోటీలు ఈ నెల 11వతేదీన నిర్వహించనున్నట్లు చైతన్య కళాస్రవంతి సభ్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే ఘంటసాల 47వ వర్ధంతి సందర్భంగా ఈనెల 11వతేదీన స్థానిక విశ్వనాథపురం కాలేజీరోడ్డులోని రామాలయం వద్ద రాష్ట్రస్థాయి ఘంటసాల పాటల పోటీలు పాటకచేరి నిర్వహించడం జరుగుతుందని…. ఈ కార్యక్రమానికి సినీనటుడు, నిర్మాత వై గిరిబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతారని అలాగే పలువురు ప్రముఖులు అతిధులుగా విచ్చేయనున్నారని……
కావున ప్రజలు బంధుమిత్రులతో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చైతన్య కళాస్రవంతి సభ్యులు మరియు రాష్ట్రస్థాయి ఘంటసాల పాటలపోటీల నిర్వాహకులు ఒక ప్రకటన చేశారు.