స్థానికులకు 75శాతం రిజర్వేషన్లకై కర్ణాటక బంద్… తీవ్ర ఉద్రిక్తత

స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కర్నాటకలో నిర్వహిస్తున్న బంద్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వివరాల్లోకి వెళితే కర్నాటక రాష్ట్రంలోని పరిశ్రమలు, సంస్థల నందు 75శాతం రిజర్వేషన్లు స్థానికులకే కల్పించాలని కోరుతూ 113ప్రజా సంఘాలు బంద్ కు ఇచ్చిన పిలుపు మేరకు కర్నాటక రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.

వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడగా…. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.