సమ్మె బాట పట్టిన పంచాయతీ ఒప్పంద కార్మికులు

పంచాయతీ ఒప్పంద కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు.

వివరాల్లోకి వెళితే స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద గురువారంనాడు పంచాయతీ ఒప్పంద కార్మికులు శిబిరాన్ని ఏర్పాటు చేసి సమ్మెకు దిగారు.

ఈ సందర్భంగా పలువురు ఒప్పంద కార్మికులు మాట్లాడుతూ గత ఐదు నెలలుగా జీతాలను చెల్లించకపోవడం పట్ల నిరసనగా నేటి నుండి సమ్మెకు దిగవలసి వచ్చిందని….. సుమారుగా ఏబై లక్షల రూపాయలకు పైగా కార్మికులకు చెల్లించాల్సి ఉందని……

అదే విధంగా తమకు పియఫ్ సంబంధించి 15లక్షల రూపాయలు రావలసి ఉందని….. కార్మికులకు చేతి గ్లౌజులు, బట్టలు, కొబ్బరి నునె, చెప్పులు ఇవ్వలేదని….. కనీసం వారానికి ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వడం లేదని ఆరోపించారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు ఎలాంటి టెండర్లు లేకుండా నేరుగా పనిలోకి తీసుకుని చెల్లింపు నేరుగా ఇవ్వవలసి ఉండగా….. పంచాయతీ అధికారులు మాత్రం అలా చెల్లింపులు చేయడం లేదని ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు తాము సమ్మెలో కొనసాగుతామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ ఒప్పంద కార్మికులు తదితరులు పాల్గొన్నారు.