రాజకీయ పార్టీలకు ఝలక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే రాజకీయ పార్టీలలో నేర చరిత్ర కలిగిన నాయకులు ఎక్కువైపోయారని వివిధ సంస్థలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై గురువారంనాడు విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ…..
రాజకీయ పార్టీలలో నేర చరిత్ర కలిగిన రాజకీయవేత్తలు ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ….. రాజకీయ పార్టీలు వారి వారి పార్టీలలో ఉన్న నేర చరిత్ర కలిగిన నాయకులకు సంబంధించి పూర్తి వివరాలను అలాగే వారిని పార్టీలో చేర్చుకోవడానికి గల కారణాలను పొందుపరుస్తూ వారిపై ఎటువంటి నేరం క్రింద కేసులు ఉన్నాయి అనే అంశాలను 48గంటలలోగా ఆయా రాజకీయ పార్టీలు వారి అధికారిక వెబ్‌సైట్లలో పొందుపరచాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది.