రెండో రోజుకు చేరిన పంచాయతీ కార్మికులు సమ్మె…. వంటావార్పు నిర్వహించిన కార్మికులు
పంచాయతీ ఒప్పంద కార్మికులు సమ్మె రెండో రోజుకు చేరుకుంది.
వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు
పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న పంచాయతీ ఒప్పంద కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది…. ఈ సందర్భంగా పంచాయతీ ఒప్పంద కార్మికులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.
తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని పియఫ్ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్, పొదిలి డివిజన్ కార్యదర్శి ఎం రమేష్ పంచాయతీ ఒప్పంద కార్మికులు తదితరులు పాల్గొన్నారు.