కన్నుల పండుగగా శ్రీ పార్వతి సమేత నిర్మమహేశ్వరస్వామి ధ్వజారోహణ

కన్నుల పండుగగా శ్రీ పార్వతి సమేత నిర్మమహేశ్వరస్వామి ధ్వజారోహణ

*ముక్కోటి దేవతా ఆహ్వాన కార్యక్రమంలో భక్తుల కోలాహలం

*గరుడముద్దకై పోటీ పడిన భక్తులు

పృధులాపురి శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారంనాడు ధ్వజారోహణ, దేవతా ఆహ్వాన, గరుడముద్ద ప్రసాద కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే శ్రీ పార్వతి సమేత నిర్మమహేశ్వరస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవరోజు అయిన శుక్రవారంనాడు ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా వేదపండితులు పూజలు నిర్వహించారు……

పూజానంతరం స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు స్వామివారి సేవకుడు గరుత్మంతుడిని పంపిస్తూ నిర్వహించిన దేవతా ఆహ్వాన కార్యక్రమంలో భక్తులు కోలాహలంగా పాల్గొన్నారు.

అనంతరం గరుడముద్ద ప్రసాదాన్ని స్వీకరించడం వలన సకల శుభాలు జరుగుతాయనే ప్రతీతి ఉండడంతో….. వివాహం, సంతానం, ఉద్యోగం, వ్యాపారం వంటి వాటిలో అన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ విశ్వాసంతో భక్తులు గరుడముద్దల కోసం పోటీపడ్డారు.