సమ్మె విరమించిన పంచాయతీ ఒప్పంద కార్మికులు

స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులు చేస్తున్న సమ్మె రెండవ రోజుకు చేరుకోగా వారి సమస్యలును పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి మేజర్ గ్రామ పంచాయతీ ఒప్పంద కార్మికులు వారికి రావలసిన అయిదు నెలల జీతాల బకాయిలు చెల్లించాలని అలాగే పీఎఫ్ బకాయిలు, మాస్క్ లు, దుస్తులు, నూనె, సబ్బులు వంటి సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె చేస్తామని గురువారంనాడు సమ్మె బాట పట్టగా……. శుక్రవారంనాడు సాయంత్రం అధికారులు వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించి పనులలో కొనసాగుతామని తెలిపారు.