కరోనా వైరస్ నివారణ సూచిక పటాలను ఆవిష్కరించిన తహశీల్దారు

కరోనా వైరస్ నివారణ చర్యలకు సంబంధించిన సూచిక పటాలను తహశీల్దారు ప్రభాకరరావు ఆవిష్కరించారు.

వివరాల్లోకి వెళితే స్థానిక తహశీల్దార్ కార్యాలయం నందు వినియోగదారుల రక్షణ సమితి వారు తయారు చేసిన కరోనా వైరస్ నివారణ సూచిక పటాలను శనివారంనాడు తహశీల్దారు ప్రభాకరరావు లాంఛనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సూచిక పటాలను ఏర్పాటు చేయడం శుభపరిణామమని వైరస్ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు….. అనంతరం పట్టణంలో పలు పాఠశాలల్లో ‌సూచిక పటాలను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రఫీ, ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల రక్షణ సమితి కోశాధికారి కొత్తురి చెంచునారాయణ, స్థానిక నాయకులు ఓ డి షకిలా, అపర్ణ, జివి షా, జహంగీర్ భాషా, దర్నాసి రామారావు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.