త్వరలోనే పొదిలి పెద్దచెరువు రిజర్వాయర్ గా మార్పు : జిల్లా కలెక్టర్ పోలా

పొదిలి పెద్దచెరువు రిజర్వాయర్ గా మార్పుకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు.

వివరాల్లోకి వెళితే బుధవారంనాడు స్థానిక దరిశి రోడ్డులోని మంజునాథ కళ్యాణ మండపం నందు జరిగిన మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాల అభివృద్ధి పనుల సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ను పెద్ద చెరువు రిజర్వాయర్ గా మార్పు ప్రక్రియ సంబంధించిన ప్రగతి గురించి పొదిలి టైమ్స్ ప్రతినిధి అడగగా సంబంధించిన ఫైల్స్ ను పరిశీలన చేసి త్వరలోనే పనుల ప్రారంభం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.