నివేశన స్ధలాల పనులను పరిశీలించిన శాసనసభ్యులు కుందూరు
నివేశన స్ధలాల పనులను మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి పరిశీలించారు.
వివరాల్లోకి వెళితే సోమవారంనాడు మండలంలోని సలకనూతల, మాదాలవారిపాలెం గ్రామాలలో పేదలకు నివేశన స్ధలాల పంపిణీ కోసం సిద్ధం చేసిన భూమిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రభాకరరావు, వైసిపి నాయకులు జి శ్రీనివాసులు, గుజ్జుల రమణారెడ్డి, ఉలవ గోపి, కొత్తపులి బ్రహ్మరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, వినోద్, మరియు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.