అక్రమ నిర్మాణాల ఆరోపణలపై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలతో వచ్చిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ విచారణకు ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక పెద్ద బస్టాండ్ సమీపంలో ప్రభుత్వం భూమిని ఆక్రమించి వాణిజ్య సముదాయ నిర్మాణ పనులను చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సైదా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కు ఫిర్యాదు చేయగా సంబంధించిన ఫిర్యాదుపై విచారణ జరపాలని మార్కాపురం రెవెన్యూ డివిజన్ అధికారికి ఆదేశాలు జారీ చేశారని షేక్ సైదా ఒక ప్రకటన విడుదల చేశారు.