ఏకాంతసేవతో ముగిసిన కళ్యాణ బ్రహ్మోత్సవాలు
శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏకాంతసేవతో ముగిశాయి.
వివరాల్లోకి వెళితే పృధులాపురి పట్టణంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు 13వతేది అంకురార్పణతో ప్రారంభమై 26వ తేది నేడు బుధవారంనాడు ఏకాంతసేవ , పుష్పమండంతో ముగియడం జరిగిందని దేవస్థానము ప్రధాన అర్చకులు మూలంరాజు సుబ్బనరసయ్య తెలిపారు.