ఆదర్శ గ్రామంగా ఆముదాలపల్లి ఎంపిక

ఆదర్శ్ గ్రామ యోజన క్రింద ఆదర్శ గ్రామంగా ఆముదాలపల్లిని ఎంపిక చేశారు.

వివరాల్లోకి వెళితే స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదర్శ్ గ్రామ యోజన క్రింద మండలంలో గ్రామ ఎంపిక కోసం అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమం మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అధ్యక్షతన గురువారంనాడు నిర్వహించారు.

ఈ సందర్భంగా కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రతి పార్లమెంటు సభ్యులకు పార్లమెంటు పరిధిలోని కొన్ని ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసుకుని ఆదర్శ్ గ్రామ యోజన క్రింద అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగా మండలంలోని ఆదర్శ గ్రామం క్రింద ఆముదాలపల్లి గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని కాబట్టి ఆముదాలపల్లి గ్రామ అభివృద్ధికి కావలసిన విధివిధానాలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.