మార్చి 10నాటికి నివేశన స్ధలాల పనులు పూర్తి: తహశీల్దారు ప్రభాకరరావు

మార్చి 10నాటికి నివేశన స్ధలాల పనులు పూర్తి అవుతాయని మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు పొదిలి టైమ్స్ కు తెలిపారు.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా ఇల్లులేని ప్రతి పేదవారికి ఇండ్లు నిర్మించాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా పొదిలి పట్టణంలో సర్వే నెంబర్ 1177నందు గల 164ఎకరాల ప్రభుత్వ తోపు భూమి నందు 60ఎకరాలలో పేదలకు ఇంటి స్థలాలు పంపిణీకి కోసం భూమిని సిద్దం చేసి ఉపాధి హామీ పథకం కింద భూమిని చదును చేసి 2300వందల ప్లాట్లు వేసే పనులు జరుగుతున్నాయని……

ప్రస్తుతం 800 వందల ప్లాట్ల వరకు పనులు పూర్తవడం జరిగిందని… మరో పదిరోజుల్లో సంబంధించిన పనులు పూర్తి అవుతాయని మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు పొదిలి టైమ్స్ కు తెలిపారు.