నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలి: నాబార్డ్ ఎజిఎం వెంకట రమణ
నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని నాబార్డ్ ఎజిఎం వెంకట రమణ అన్నారు.
వివరాల్లోకి వెళితే శనివారంనాడు స్థానిక విశ్వనాథపురంలోని మాతృ కోచింగ్ సెంటర్ నందు నాబార్డ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కార్యక్రమ ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ప్రకాశం జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వెంకట రమణ మాట్లాడుతూ నాబార్డు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల శిక్షణలు, కొన్ని సంస్థలు ద్వారా ఉద్యోగ మరియు స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవడం కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని…..
అందులో భాగంగా పొదిలి నందు షార్ప్ సంస్థ ఆధ్వర్యంలో మాతృ కోచింగ్ సెంటర్ నందు 37మందికి కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరిగిందని….. వారు స్వతంత్రంగా స్వయం ఉపాధి పొందేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాతృ కోచింగ్ సెంటర్ కెల్లంపల్లి నజీర్, షార్ప్ సంస్థ ప్రతినిధి రవిచంద్ర, మరియు శిక్షణ అభ్యసించిన యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.