దేశవ్యాప్తంగా విజయవంతమైన జనతా కర్ఫ్యూ

భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రజలకు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ భారత ప్రజలు విజయవంతం చేశారు.

వివరాల్లోకి వెళితే దేశంలో కరోనా వైరస్ నివారణ చర్యలలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీ జనతా కర్ఫ్యూ ద్వారా ఉదయం 5గంటల నుండి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ విధించుకుని బయటికి రాకుండా ఉండడం ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించే అవకాశం ఉందని ఇచ్చిన పిలుపుమేరకు ప్రజలు స్వచ్ఛందంగా ఇంటికే పరిమితమై కర్ఫ్యూను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా వ్యాపార, వాణిజ్య, చిరు వ్యాపారులు, సినిమాహాళ్లు, పెట్రోలు బంకులు, ప్రార్ధన మందిరాలు మొదలైన వాటిలో జనం, వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే పొదిలిలోని పురవీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి….. జనతా కర్ఫ్యూ విజయవంతమైన అనంతరం దేశ, రాష్ట్ర, పట్టణ ప్రజల ఆరోగ్యంకోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యసిబ్బందికి, కార్మికులకు, పోలీసులకు తదితరులకు చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు.