పియన్ఆర్ కాలనీ యువకుడికి కరోనా లేదని వైద్యులు నిర్ధారణ
పొదిలి పట్టణంలోని పియన్ఆర్ కాలనీకి చెందిన యువకుడికి కరోనా లేదని వైద్యులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళితే పియన్ఆర్ కాలనీకి చెందిన యువకుడు ఆరోగ్యం కొద్దిగా బాగా లేకపోవడంతో శుక్రవారంనాడు స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు చికిత్స తీసుకుని తనకు కరోనా లక్షణాలపై పరిక్షలు చేయాలని స్వయంగా కోరడంతో శుక్రవారంరాత్రి యువకుడు విజ్ఞప్తి మేరకు వైద్యులు మెరుగైన చికిత్స ఒంగోలు రిమ్స్ కు తరలించి కరోనా పరిక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించగా అతనికి కరోనా లేదని రిపోర్టులో తేలడంతో అతనికి కరోనా లేదని వైద్యులు నిర్ధారించారు.