బెల్లంకొండ కళాశాలలో క్వారెంటైన్ సెంటర్ ఏర్పాటు: తహశీల్దారు ప్రభాకరరావు

బెల్లంకొండ కళాశాల క్వారెంటైన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు తెలిపారు.

వివరాల్లోకి వెళితే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పొదిలి మండలం కంభాలపాడు గ్రామంలోని బెల్లంకొండ పాలిటెక్నిక్ కళాశాలను మంగళవారంనాడు మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు, ఎంపిడిఓ శ్రీకృష్ణ , వైద్య అధికారి రాధాకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శిలు తదితరులు సందర్శించి
కార్వెంటైన్ సెంటరుకు అనుకూలంగా ఉంటుందని కళాశాల నందు క్వారెంటైన్ సెంటర్ ఏర్పాటుకు కళాశాల చైర్మన్ మరియు డైరెక్టర్లు బెల్లంకొండ శ్రీనివాస్ , విజయలక్ష్మి అంగీకారం తెలిపారని తహశీల్దారు ప్రభాకరరావు తెలిపారు.