చిరంజీవి, నాగార్జున, వరుణ్, ధరమ్ తేజ్ లకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందన
తెలుగు సినిమా కధానాయకులు మెగాస్టార్ చిరంజీవి, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, యువ హీరోలు సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ లు చక్కని సందేశంతో లఘుచిత్రం రూపొందించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ద్వారా తెలుగులో ధన్యవాదాలు తెలిపారు.
చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం. #IndiaFightsCorona https://t.co/01dO5asinD
— Narendra Modi (@narendramodi) April 3, 2020