రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తొలగింపుపై విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు
గురువారంలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
శుక్రవారంలోపు కౌంటర్ పై అభ్యంతరాలు తెలపాలని ఆదేశించిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రధానాధికారిగా పనిచేస్తున్న రమేష్ కుమార్ ను తొలగిస్తూ తీసుకుని వచ్చిన ఆర్డినెన్సును సవాల్ చేస్తూ హైకోర్టులో పదవి నుంచి తొలగించిన రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రధానాధికారిగా రమేష్ కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య, వడ్డే శోభనాద్రిశ్వరావు, భారతీయ జనతాపార్టీ నాయకులు కామినేని శ్రీనివాస్, ప్రకాశం జిల్లా న్యాయవాది కామేశ్వరరావు తదితరులు దాఖల చేసిన రిట్ పిటిషన్లపై సోమవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు గురువారంలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆ కౌంటర్ పై అభ్యంతరాలను శుక్రవారంలోపు తెలపాలని ఆదేశాలు ఇస్తూ విచారణను సోమవారం నాటికి వాయిదా వేసింది.
సోమవారంనాడు విచారణ అనంతరం పూర్తి తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాల సమాచారం.