మే 3వ తేది వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది – నరేంద్ర మోడీ
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3తేది వరకు కొనసాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
వివరాల్లోకి వెళితే భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు జాతి ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా మహమ్మారి తరిమికొట్టే దానిలో ప్రతి ఒక్క పౌరుడు సైనికుడిలా తన కర్తవ్యాన్ని నిర్వహించారని……
ప్రపంచంలోని వివిధ దేశాల కంటే మనం పటిష్ట చర్యలు తీసుకున్నామని అందులో భాగంగా ఆర్థికంగా బాగా నష్టం పోతామని తెలిసినా దేశ ప్రజల ప్రాణాలు కంటే ఏది ముఖ్యం కాదని భావించి 21 రోజులు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించామని……
కరోనా వైరస్ ఉదృతంగా కొనసాగుతుడడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మరో 19రోజులు అనగా మే 3తేది వరకు తప్పని పరిస్థితిగా పొడిగింపు చేయవలసి వస్తుందని అన్నారు.
ఏప్రిల్ 20 వరకు దేశ ప్రజల అప్రమత్తంగా ఉండాలని తనంతరం కొన్ని సడలింపులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.