పంచాయతీ కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన గ్రామీణ వైద్యులు

గ్రామ పంచాయతీ కార్మికులకు నిత్యావసర వస్తువులను గ్రామీణ‌ వైద్యులు పంపిణీ చేశారు.

వివరాల్లోకి వెళితే మంగళవారంనాడు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ప్రకాశం జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో పంచాయతీ నందు పనిచేస్తున్న 100మందికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనువాసులరెడ్డి పంచాయతీ కార్యదర్శి బ్రహ్మ నాయుడు శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి, గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు సయ్యద్ ఇమాంసా, కొనేజేటీ లక్ష్మి నారాయణ, గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.