తప్పుడు సమాచారాన్ని ‌వ్యాప్తి చేసారని ఎబిపి విలేకరి అరెస్టు

ముంబైలోని బాంద్రా పడమర ప్రాంతంలో మంగళవారం నాడు గందరగోళానికి నకిలీ వార్తలను వ్యాప్తి చేసారనే మహారాష్ట్ర పోలీసులు ఎబిపి విలేకరి రాహూల్ కులకర్ణిని తన స్వస్థలం ఉస్మానాబాద్ లోని నివాసం నుంచి అదుపు లోనికి తీసుకొని కోర్టు నందు హాజరుపరుచున్నారని మహారాష్ట్ర పోలిసులు తెలిపారు.

రాహుల్ కులకర్ణిపై సెక్షన్ 269 (జీవితానికి ప్రమాదకరమైన వ్యాధి సంక్రమణ వ్యాప్తి చెందే నిర్లక్ష్య చర్య), 270 (ప్రాణాంతక చర్య జీవితానికి ప్రమాదకరమైన వ్యాధి సంక్రమణ వ్యాప్తి చెందే అవకాశం), 505 (బి) పలు సెక్షన్ల తో కేసు నమోదు చేసినట్లు పోలీసులు దృవికరించాయి.