కార్డు లేని పేదలకు బియ్యం పంపిణీ

కుటుంబం సరఫరా రేషన్ కార్డులు లేని పేదలకు బియ్యం పంపిణీ చేసారు. వివరాలు లోకి వెళ్ళితే జాతీయ లాక్ డౌన్ లో భాగంగా రేషన్ కార్డులు లేకుండా ప్రభుత్వం ఇచ్చే నగదు బియ్యాన్ని పొందలేని నిరుపేదలకు మరియు వేల్స్ కూలీలకు జిల్లా న్యాయ సేవాధికర సంస్థ చైర్మన్ మరియు జిల్లా న్యాయమూర్తి జ్యోతిర్మయి మరియు మండల న్యాయ సేవాధికర సంస్థ చైర్మన్ & జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి యస్ సి రాఘవేంద్ర ఆదేశాల మేరకు విశ్వనాథపురంలోని రేషన్ షాపు నందు 18 కుటుంబాలకు ఒక్కరికి 10 కేజీల బియ్యాన్ని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికర సంస్థ సూపర్డెంట్ శ్రీనివాసరావు, పారా లీగల్ వాలంటీర్ బొనిగల ఆదిలక్ష్మి , గ్రామ రెవిన్యూ అధికారిలు వెలుగోండయ్య , షబ్బీర్, అనీల్ తదితరులు పాల్గొన్నారు