కోవిడ్ పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ప్రత్యేక అధికారి
కోవిడ్-19 పునరావాస కేంద్రాన్ని మార్కాపురం నియోజకవర్గ కోవిడ్ నివారణ ప్రత్యేక అధికారి యన్ విజయకుమార్ సందర్శించారు.
వివరాల్లోకి వెళితే గురువారంనాడు మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయంలో మండల తాజా పరిస్థితులపై సమీక్షించిన అనంతరం మాదాలవారి పాలెంలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ఉన్న వారిని అడిగి పలు అంశాలను తెలుసుకుని అక్కడ ఏర్పాటు చేసిన భోజనం సదుపాయాన్ని పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు, ఎంపిడిఓ శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, ప్రభుత్వ వైద్యులు రాధాకృష్ణ ఆర్ఐ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.