అర్నబ్ పై దాడి చేసిన వారిపై చర్యలకై తహశీల్దారుకు వినతిపత్రం అందజేసిన పొదిలిటైమ్స్
రిపబ్లిక్ టివి ఎడిటర్ అర్నబ్ గోస్వామి పై గత అర్థరాత్రి దాడి చేసిన యువజన కాంగ్రెసు కార్యకర్తలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారంనాడు పొదిలి మండల రెవిన్యూ తహశీల్దారు ప్రభాకరరావుకు పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్ వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మందగిరి వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ మహారాష్ట్ర రాజధాని ముంబై నందు రాత్రి రిపబ్లిక్ టివిలో లైవ్ డిబేట్ పూర్తి చేసుకుని తన భార్యతో కలిసి ఇంటికి వెళ్ళే సమయంలో కొంతమంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అర్నబ్ గోస్వామి కారును వెంబడించి దాడి చేయడంతో……
ఇంటి సమీపంలోకి వెళ్ళగానే
గాడ్స్ రక్షించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డరాని ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడిన వారిపై వారి వెనుక ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.