ఆరెంజ్ మరియు రెడ్ జోన్లకు ఒకే‌ రకమైన ఆంక్షలు – ప్రత్యేక అధికారి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోవిడ్-19 అలెర్ట్ జోన్ల విధానంలో ఆరెంజ్ మరియు రెడ్ జోన్లకు ఒకేరకంగా ఆంక్షలు ఉంటాయని మార్కాపురం నియోజకవర్గం కోవిడ్-19 నివారణ ప్రత్యేక అధికారి విజయకుమార్ తెలిపారు.

మండల పర్యటనలో భాగంగా స్ధానిక తహశీల్దారు కార్యాలయానికి విచ్చేసిన ప్రత్యేక అధికారి విజయకుమార్ ను కలిసిన పొదిలి టైమ్స్ తో ఆయన మాట్లాడుతూ కొనకనమిట్ల మండలం ‌వెలిగండ్ల గ్రామ నందు కోవిడ్ నిర్ధారణ కేసు నమోదు కావడంతో ఆ గ్రామం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిధిని రెడ్ జోన్ ప్రకటించగా….. ఆ యొక్క పరిధిలో పొదిలి మండలంలోని 7 గ్రామాలు ఉన్నాయని ప్రస్తుతం కోవిడ్ నిర్ధారణ అయిన రెడ్ జోన్ పరిధిలో గడిచిన 14రోజుల్లో ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో నేటి నుండి ఆరెంజ్ జోన్ గా మార్పు చేయడం జరిగిందని……

రెడ్ మరియు ఆరెంజ్ జోన్లకు ఒకేరకంగా ఆంక్షలు ఉంటాయని ప్రభుత్వ ఆంక్షలు ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమయంలో తహశీల్దారు ప్రభాకరరావు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.