జాతీయ లోక్ అదాలత్ లో 41 కేసులు పరిష్కారం
పొదిలి పట్టణంలో శనివారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా న్యాయ విజ్ఞన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్జి రాఘవేంద్ర మాట్లాడుతూ వివిధ కేసులు మనిషిలోని ప్రవర్తన వల్ల జరుగుతూ ఉంటాయి వాటిని అదుపులో పెట్టుకుంటే కేసులు కొంత వరకు దగ్గించ వచ్చున్నారు. ఇలాంటి కార్యక్రమంలో ఒక్క రోజుకు 100 కేసులు పరిష్కారం చేయవచ్చు తక్కువ సమయంలో ఎక్కువ కేసులకు పరిష్కరంకు ఆస్కారం ఉంటుందన్నారు. ఏ ఇద్దరు రాజీకి వచ్చిన్నంత మాత్రన ఓడిపోయిన ట్లు కాదు, వారి యొక్క సమస్యలు త్వరగా పరిష్కరం అవుతాయన్ని అయినా అన్నారు. అనంతరం జరిగిన సదస్సు లో మొత్తం 41 కేసులు రాజీకాగా 8లక్షల 29వేల 956 రూపాయలు పరిహారం గా ఇప్పించాటం జరిగిందిని కోర్టు సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమంలో మర్రిపూడి కొనకనమీట్ల తర్లబాడు యస్ ఐ లు శ్రీహరి నాగార్జున
న్యాయవాదులు యస్ ఎం భాష సురేష్ శ్రీనివాసరావు రామరావు రామ్మ్ మోహన్ రావు పెద్దయ్య సుజాత తదితరులు పాల్గొన్నారు