విపత్కర పరిస్థితుల్లో పనిచేసిన సిబ్బందికి పౌరసన్మానం : కందుల

కోవిడ్-19తో పొంచివున్న విపత్కర పరిస్థితుల్లో ‌ప్రాణలను సైతం లెక్కచేయకుండా విధినిర్వహణలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన వివిధ శాఖల సిబ్బందికి మరియు ‌మీడియా సిబ్బందికి వారికి పౌరసన్మానం చెస్తామని మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు‌ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి మంగళవారంనాడు సామాజిక మాధ్యమం ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.

మార్కాపురం నియోజకవర్గ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ‌కృషి చేసిన పోలీస్, వైద్య, పంచాయతీ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ,‌ విద్యుత్ శాఖ, మరియు ‌మీడియా సిబ్బందికి పౌరసన్మానం కార్యక్రమాన్ని మండలలా వారిగా నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని లాక్ డౌన్ మినహాయింపు ఇచ్చిన తరువాత తేదిలు ఖరారు చేసి పౌర సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.