సిఎం సహాయ నిధికి 50వేలు విరాళం అందజేసిన గీతాంజలి విద్యాసంస్థ
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా 50వేల రూపాయల చెక్కును మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి చేతికి అందజేశారు.
వివరాల్లోకి వెళితే గీతాంజలి విద్యాసంస్థ మాజీ చైర్మన్ కీ”శే కెవి రమేష్ బాబు జ్ఞాపకార్ధంగా
సతిమణీ గీతాంజలి విద్యాసంస్థ కార్యదర్శి కె భాగ్యలక్ష్మి లాక్ డౌన్ లో భాగంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సహాయం పాడేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి పేరుతో 50వేలు డిడిని తీసి స్ధానిక మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులు రెడ్డి స్వగృహంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి చేతికి అందజేసినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులు రెడ్డి, దోర్నాల వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.