కరోనా నివారణకై అత్యవసర విస్తృత సమావేశం
కరోనా నివారణ చర్యలకై అత్యవసర విస్తృత సమావేశం నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో అత్యవసర విస్తృత సమీక్ష సమావేశం జిల్లా పరిషత్ సిఇఓ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని రామాపురం గ్రామంలో మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి రామాపురంతో పాటు సమీప గ్రామాలైన సుదనగుంట , తమ్మగుంట,
గురుగుపాడు గ్రామాలను బఫర్ జోన్ పరిధిలో తీసుకుని లాక్ డౌన్ పూర్తిస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాలని….. ఆ యొక్క గ్రామాల్లో నిత్యావసర వస్తువులను ప్రభుత్వం అందజేసే బాధ్యత తీసుకోవాలని సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, నియోజకవర్గం ప్రత్యేక అధికారి విజయకుమార్, జిల్లా సహాయ వైద్య అధికారిణి పద్మావతి , సిఐ శ్రీరామ్, తహశీల్దారు ప్రభాకరరావు, ఉప్పలపాడు ప్రభుత్వ వైద్య అధికారి రాధాకృష్ణ, పొదిలి యస్ఐ సురేష్, ఎంపిడిఓ శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్, మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.