ఐసీయూలో ఉన్న ఉద్యోగికి నగదు సహాయం ఈఓఆర్డీ శంకర్ యాదవ్
ఐసియులో ఉన్న ఉద్యోగికి సహాయంగా మర్రిపూడి మండల పంచాయతీ రాజ్ విస్తరణ అధికారి పెట్టెల శంకర్ యాదవ్ 10వేల రూపాయల నగదును అందజేశారు.
వివరాల్లోకి వెళితే కోమరోలు గ్రామ సచివాలయంలో సంక్షేమ మరియు విద్యా అసిస్టెంటుగా పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రిలో ఐసియులో ఉండగా….. తల్లిదండ్రులు లేని ఆ ఉద్యోగికి ఆర్థిక సహాయం చేయాలని మర్రిపూడి మండల గ్రామ సచివాలయ ఉద్యోగులు కోరగా తక్షణమే స్పందించిన ఈఓఆర్డీ శంకర్ యాదవ్ వారికి 10వేల రూపాయల నగదును అందజేశారు.