ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను విక్రయించడం మరియు విద్యుత్తు చార్జీలు పెంపును నిరసిస్తూ భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం నాడు స్థానిక ఆంధ్ర బ్యాంకు వీధిలో నల్ల బ్యాడ్జిలతో బిజెపి నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ నాయకులు సూరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాగులూరి రామయ్య, ఆకుపాటి లక్ష్మణ్, ప్రసాద్, చాట్ల కుమార్, జె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.