రేపటి నుండి రోడ్డెక్కనున్న బస్సులు
రేపు అనగా గురువారంనాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సులు రోడ్డెక్కనున్నాయి.
వివరాల్లోకి వెళితే జాతీయ లాక్ డౌన్ తో గత 56రోజులుగా డిపోలకే పరిమితమైన బస్సులు లోక్ డౌన్ 4.0నందు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే…..
అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించి పరిమిత సంఖ్యలో బస్సులను తిప్పే విధంగా రాష్ట్ర రవాణా సంస్థ ఏర్పాట్లు చేసింది….. అందులో భాగంగా రేపటి నుంచి పొదిలి ఆర్టీసీ డిపో చెందిన 11సర్విసులు… అద్దంకి 3… కనిగిరి 3…..ఒంగోలు 5…… చొప్పున బస్సులు తిప్పే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉదయం 7గంటల నుండి రాత్రి 7గంటలకు డిపోకు బస్సులు చేరే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
బస్టాండ్ వద్ద టికెట్ తీసుకుని బస్సు ఎక్కే ప్రయాణికులు ఖచ్చితంగా మాస్కును ధరించే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.