పొగాకు బోర్డును సందర్శించిన శాసనసభ్యులు కుందూరు
గిట్టుబాటు ధర కల్పించాలని కోరిన రైతులు
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ
పొదిలి పొగాకు బోర్డును మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వివరాల్లోకి వెళితే బుధవారంనాడు స్థానిక పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని 21ని శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డితోపాటు వైసిపి రైతు విభాగం నాయకులు సందర్శించి వేలంలో ధరలను రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా పొగాకు రైతులపై తీవ్రంగా ప్రభావం పడిందని రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్ని నివారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీసుకుని వెళ్ళి రైతులకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందో ఆ విధంగా న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైకాపా రైతు విభాగం పార్లమెంటు కమిటీ అధ్యక్షులు స్థానిక నాయకులు సానికొమ్ము శ్రీనివాసులు రెడ్డి, జి శ్రీనువాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గుజ్జులా రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.