60కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 60కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే రంజాన్ మాసం సందర్భంగా లాక్ డౌన్ వలన పనులు లేక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న 60పేద కుటుంబాలకు హాబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కరిముల్లా బేగ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఇళ్లలోనే పండుగను సంతోషంగా జరుపుకోవాలని….. కరోనా మహమ్మారి త్వరగా నశించిపోవాలని రంజాన్ పండుగలో అల్లా ను ప్రార్ధించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు హబీబుల్లా బేగ్ మరియు సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.