గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కుందూరు
గ్రామ సచివాలయ నూతన భవనానికి మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి శంకుస్థాపన చేశారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు స్థానిక మండలంలోని కుంచేపల్లి గ్రామం నందు నూతన భవనానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సానికొమ్ము శ్రీనివాసులు రెడ్డి, జి శ్రీనివాసులు, కసిరెడ్డి వెంకట రమణారెడ్డి, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి, హనీమున్ శ్రీనివాస్ రెడ్డి, గొలమారి చెన్నారెడ్డి స్థానిక వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.