సాయిబాబా గుడికి 7లక్షలు అందజేసిన పండు అనిల్ దంపతులు
సాయిబాబా గుడికి 7లక్షల రూపాయలను పండు అనిల్ సురేఖ దంపతులు అందజేశారు.
వివరాల్లోకి వెళితే స్ధానిక సాయిబాబా గుడి రెండవ అంతస్తులోని ఎసి మరియు అభివృద్ధి పనులు కోసం 7లక్షల రూపాయలు అందజేసి అనంతరం పండు అనీల్ సురేఖ దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వెలిశెట్టి వెంకటేశ్వర్లు, సాయిబాబా దేవస్థానం పాలక మండలి సభ్యులు కలువా సత్యనారాయణ, సామి రాజా, భూమ రామారావు, దుడ్డు శ్రీనివాస్, కొండవీటి సాంబశివరావు, వేమ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.