అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది : నెమలిరాజు
అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది ప్రముఖ బుల్లితెర నటుడు అదిరింది ఫేం నెమలిరాజు అన్నారు.
పెన్ పవర్ దినపత్రిక ఆధ్వర్యంలో గత 65రోజుల నుండి నిర్వహిస్తున్న అన్నదానం కార్యక్రమంలో సోమవారంనాడు సొంత ఊరులో అన్నదానం కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా సంతృప్తినిచ్చిందని….. ఈ లాక్ డౌన్ సమయంలో అన్నదానం చేయడం ద్వారా పలువురి ఆకలి తీర్చే కార్యక్రమంలో భాగస్వామిని చేసిన పెన్ పవర్ దినపత్రిక వారికి నెమలిరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనువాసులరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మ నాయుడు, మరియు పెన్ పవర్ దినపత్రిక యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.