నెమలిరాజును ఘనంగా సత్కరించిన పంచాయతీ సిబ్బంది
బుల్లితెర అదిరింది ఫేం నెమలిరాజును గ్రామ పంచాయతీ సిబ్బంది ఘనంగా సత్కరించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు గత 65రోజుల నుండి పెన్ పవర్ దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం కార్యక్రమానికి సోమవారంనాడు దాతగా వ్యవహారించిన అదిరింది ఫేం నెమలి రాజు పంచాయతీ కార్యాలయానికి హాజరు కావడంతో పొదిలి చెందిన నెమలి రాజును పంచాయతీ సిబ్బంది ఘనంగా సత్కరించి మెమోటోను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనువాసులరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మ నాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, మరియు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.