వాల్మీకి బోయలకు యస్టీ రిజర్వేషన్ కల్పించాలని శాసనసభ్యులు కుందూరుకు వినతిపత్రం అందజేసిన వాల్మీకి సాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాల్మీకి బోయలను షెడ్యూల్ ట్రైబల్ యస్టీ జాబితాలో చేర్చాలని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డికి ఆంధ్రప్రదేశ్ బోయ జాయింట్ యాక్షన్ కమిటీ పొదిలి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నాడు వినతిపత్రాన్ని అందజేశారు.
16తేది నుండి జరిగే శాసనసభ సమావేశాలలో బోయలను యస్టీ జాబితాలో చేర్చేందుకు నిర్ణయం తీసుకోవాలని వినతిపత్రంలో కోరగా…… ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని కుందూరు హామీ ఇచ్చారని బోయ జాయింట్ యాక్షన్ కమిటీ పొదిలి శాఖ అధ్యక్షుడు వాల్మీకి సాయి తెలిపారు.