కేంద్ర ప్రభుత్వం పేదలపై కపట ప్రేమను విడాలి : సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి రమేష్
కేంద్ర ప్రభుత్వం పేదలపై కపటప్రేమను వీడి ఆదుకునే దిశగా ఆలోచించాలని సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి యం రమేష్ అన్నారు.
వివరాల్లోకి వెళితే పొదిలి గ్రామ పంచాయతీ పరిధిలోని సచివాలయాల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించిన అనంతరం సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు కుటుంబానికి 7,500రూపాయలు, 10కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులను 6నెలల పాటు ఉచితంగా అందించాలని……. ఉపాధి హామీ పథకం పట్టణాలలో కూడా ప్రారంభించి పనిదినాలను 200రోజులకు తగ్గకుండా ఉపాధి కల్పించాలని……
కరోనాతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు అని చెప్తూ 20లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని కార్పొరేట్ సంస్థల రాయితీలకు, రుణమాఫీలకు కట్టబెట్టారు తప్పితే ఆ ప్యాకేజి వలన పేద ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు….. ఇప్పటికైనా పేదల సంక్షేమం దిశగా చర్యలు తీసుకోకపోతే బిజెపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు.
అనంతరం పొదిలి గ్రామ పంచాయతీ కార్యదర్శి బ్రహ్మనాయుడుకు మరియు సచివాలయాల కార్యదర్శిలకు వినతిపత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పి నరసింహ, లతీఫ్ బి, కోటమ్మ, ఏసేబు, యోగయ్య, మద్దెయ్య, హైమా, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.