నాలుగు రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకున్న వైఎస్ఆర్ సిపి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో నాలుగు స్థానాలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికల జరగగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని….. తెలుగుదేశం పార్టి తరుపున వర్ల రామయ్యతో సహా ఐదుగురు పోటీ చేయడంతో ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది దానితో నేడు పోలింగ్ నిర్వహించిన అనంతరం కౌంటింగ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురూ గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.