వేలం కేంద్రం నిలిపివేత వేలం కేంద్రం వద్ద నిరసన
గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్
పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు వేలాన్ని బహిష్కరించి వేలం కేంద్రం వద్ద పొగాకును తగలబెట్టి రైతులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఐటీసీ కంపెనీ మినహా మిగిలిన అన్ని కంపెనీలు పొగాకు వేలంలో పాల్గొనేటట్లు చేయకపోవడం వలన రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని….. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.