సరదాకి పోయి సంఘవిద్రోహ ముద్ర వేసుకోకండి… అసత్య ప్రచారాలు మానుకోండి

పొదిలిటైమ్స్ పాఠక, వీక్షకులకు చిన్న మనవి మా ఛానల్ నందు ప్రసారం చేసిన ఓ కోవిడ్ పాజిటివ్ కేసుకు సంబంధించిన సమాచారంపై గత రెండు రోజులుగా కొందరు వ్యక్తులు మా పై కుల, మత బేధాలను అంటగడుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారు…. ఈ విషయంపై ప్రజలకు అవగాహన ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నాం దయచేసి వీక్షకులు ఈ వీడియోను జాగ్రత్తగా గమనించండి………….

ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఎక్కడైనా కులాన్ని కానీ మతాన్ని కానీ పొందుపరచడం జరగలేదు…. అయితే కొందరు వ్యక్తులు మాత్రం వారి సరదా కోసమో లేక మాపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానో సోషల్ మీడియాలో కులాన్ని పొందుపరచామని అసత్య ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి వారిని సంఘ విద్రోహ శక్తులుగా కూడా పరిగణించవచ్చు…….

ఇటువంటి వారిని పొదిలిటైమ్స్ ఉపేక్షించేది లేదని మాపై ఎవరైతే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారో మీరు మేము తీసుకునే చట్టపరమైన చర్యలకు మూల్యం చెల్లించాల్సి రావచ్చునని హెచ్చరిస్తూ…..

ఇది మా మొదటి చివరి హెచ్చరికగా భావించి అసత్య ప్రచారాల వలన చిక్కుల్లో పడవద్దని సూచిస్తూ…….

మీ

పొదిలిటైమ్స్ యాజమాన్యం