రెడ్ జోన్ పరిధిలో నివారణ చర్యలు చేపట్టిన అధికారులు
పట్టణంలోని విశ్వనాథపురం కోవిడ్ కేసుకు సంబంధించిన రెడ్ జోన్ పరిధిలో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే బుధవారంనాడు నమోదయిన కోవిడ్ కేసు దృష్ట్యా పట్టణంలోని విశ్వనాథపురం రెడ్ జోన్ పరిధిలో హైడ్రో క్లోరైన్ ద్రావణాన్ని చల్లి…. రెడ్ జోన్ పరిధిలో నుండి ఎవరు బయటికి రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
పట్టణంలో నమోదవుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని….. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి ఎస్ఐ సురేష్, పంచాయతీ సానిటరి ఇన్స్పెక్టర్ మారుతిరావు, పంచాయతీ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.