పట్టణంలో తాజాగా మరో రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు

వివరాల్లోకి వెళితే  పట్టణంలో కొత్తగా మరో రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి….. పాజిటివ్ నమోదయిన  ఇద్దరు స్థానిక విశ్వనాథపురం కాలేజి రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్నారని ఇద్దరు సమీప బంధువులని సమాచారం.
ప్రస్తుతం నమోదయిన కేసులతో కలుపుకుని పట్టణంలోని మొత్తం-6, పంచాయతీలోని మొత్తం-7, మండలంలోని మొత్తం-9 యాక్టివ్ కేసుల నమోదయ్యాయి.

తాజాగా పట్టణంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు కఠిన ఆంక్షలు విధిస్తూ ఉదయం 6గంటల నుండి 9గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచడం జరగడమే కాకుండా పొదిలి పట్టణంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.